Telangana Election 2023: నీ ఆస్తిపాస్తులన్నీ ప్రజలకు పంచే దమ్ముందా..?: బండి సంజయ్
తెలంగాణ ఎన్నికల వేళ గంగుల కమలాకర్ మీద బండి సంజయ్ విరుచుకుపడ్డారు. తనపై చేస్తున్న అవినీతి ఆరోపణలను నిరూపించాలని ఆయన డిమాండ్ చేశారు. తాను అక్రమంగా సంపాధించిన ఆస్తులు ఏమున్నాయో నిరూపిస్తే.. వాటిని కరీంనగర్ ప్రజలకు పంచేందుకు సిద్ధమని బండి సంజయ్ సవాల్ విసిరారు.