KCR: నేడు అసెంబ్లీకి రానున్న కేసీఆర్.. తొలి ప్రసంగంపై ఉత్కంఠ
బీఆర్ఎస్ చీఫ్, మాజీ సీఎం కేసీఆర్.. ప్రతిపక్ష నాయకుడి హోదాలో శనివారం మొదటిసారిగా అసెంబ్లీ సమావేశాలకు రానున్నారు. గవర్నర్ ప్రసంగం, ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చకు కేసీఆర్ రెండు రోజులు రాలేదు. ఎన్నికల్లో ఓటమి తర్వాత తొలిసారి రానుండటంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది