Harish Rao: రైతు బంధు ఎప్పుడు వేస్తారు?.. హరీష్ రావు ఫైర్!
రైతాంగం అంతా రాష్ట్ర ప్రభుత్వం వైపు చూస్తుందని అన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు. రైతు బంధు పెంచుతాం అన్నారు.. పెంచిన రైతు బంధు ఎప్పుడు నుంచి ఇస్తారు అని రాష్ట్ర సర్కార్ ను ప్రశ్నించారు.
రైతాంగం అంతా రాష్ట్ర ప్రభుత్వం వైపు చూస్తుందని అన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు. రైతు బంధు పెంచుతాం అన్నారు.. పెంచిన రైతు బంధు ఎప్పుడు నుంచి ఇస్తారు అని రాష్ట్ర సర్కార్ ను ప్రశ్నించారు.
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు డిసెంబర్ 14వ తేదీకి వాయిదా పడ్డాయి. ఇవాళ ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేయగా.. 18 మంది గైర్హాజరయ్యారు. వీరిలో బీఆర్ఎస్ నుంచి 7, కాంగ్రెస్ నుంచి ముగ్గురు, బీజేపీ నుంచి 8 మంది సభ్యులు సభకు రాలేదు.
బీజేపీ అధిష్టానంపై ఆ పార్టీ ఎమ్మెల్యే రాజాసింగ్ అలిగారు. ఓవైపు తాను ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయనంటూనే.. తనకు బీజేఎల్పీ పదవి కోసం పట్టుబడుతున్నారు. ఈ క్రమంలో పార్టీ అధిష్టానంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. బీజేఎల్పీ సమావేశం మధ్యలోనే లేచి వెళ్లిపోయారు.
తెలంగాణ బీజేపీ నేతలు అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించారు. అక్బరుద్దీన్‌ను ప్రొటెం స్పీకర్‌గా నియమించడాన్ని వ్యతిరేకిస్తూ సభకు డుమ్మా కొట్టారు. అక్బరుద్దీన్ ముందు తాము ప్రమాణ స్వీకారం చేయలేమన్నారు. సీనియర్లను కాదని అక్బరుద్దీన్‌కు ప్రొటెం స్పీకర్‌గా అవకాశం ఇవ్వడాన్ని తప్పుపట్టారు.
తెలంగాణ అసెంబ్లీ సమావేశం ప్రారంభమైంది. ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ వీరితో ఎమ్మెల్యేలుగా ప్రమాణం చేయిస్తున్నారు. 8 మంది బీజేపీ ఎమ్మెల్యేలు సభను బహిష్కరించగా.. కేసీఆర్, కేటీఆర్ సభకు హాజరు కాలేదు.
బీఆర్ఎస్ఎల్పీ లీడర్‌గా కేసీఆర్‌ను ఎన్నుకున్నారు ఆ పార్టీ ఎమ్మెల్యేలు. తెలంగాణ అసెంబ్లీ సమావేశం నేపథ్యంలో తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ఎల్పీ భేటీ జరిగింది. ఈ భేటీలో కేసీఆర్‌ను బీఆర్ఎస్ఎల్పీ నేతగా పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రతిపాదించగా.. తలసాని శ్రీనివాస్, కడియం శ్రీహరి బలపరిచారు.
తెలంగాణ అసెంబ్లీ ప్రొటెం స్పీకర్‌గా ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ తమిళిసై ఆయనతో ప్రొటెం స్పీకర్‌గా ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, హరీష్ రావు పాల్గొన్నారు.
రేపు అసెంబ్లీని బహిష్కరిస్తున్నామని అన్నారు బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్. ఈ ఎన్నికల్లో గెలిచినా ఎనిమిది మంది బీజేపీ ఎమ్మెల్యేలు రేపు ప్రమాణస్వీకారం చేయరని తేల్చి చెప్పారు. కాంగ్రెస్ హయాంలో కూడా ఎంఐఎం దే రాజ్యం నడుస్తుందని ఆరోపించారు.
119మంది ఎమ్మెల్యేలు ఉన్న తెలంగాణ అసెంబ్లీలోకి ఈ సారి 43మంది రెడ్డి కులానికి చెందిన వారే అడుగుపెట్టనున్నారు. 13 మంది వెలమలు, నలుగురు కమ్మలు, బ్రాహ్మణ, వైశ్య కులాల నుంచి ఒక్కొక్కరు అసెంబ్లీలో అడుగుపెడతారు. అటు బీసీల ఎమ్మెల్యేల సంఖ్య 19గా ఉంది.