Supreme court:ప్లీజ్ నన్ను మైలార్డ్ అని పిలవకండి...
మైలార్డ్, యువర్ లార్డ్ షిప్స్ అని దయచేసి నన్ను పిలవొద్దు అంటున్నారు సుప్రీంకోర్టు న్యాయమూర్తి. అలా అనడం ఆపేస్తే నా జీతంలో సగం మీకు ఇచ్చేస్తానంటూ వేడుకున్నారు జస్టిస్ పీఎస్ నరసింహ.
మైలార్డ్, యువర్ లార్డ్ షిప్స్ అని దయచేసి నన్ను పిలవొద్దు అంటున్నారు సుప్రీంకోర్టు న్యాయమూర్తి. అలా అనడం ఆపేస్తే నా జీతంలో సగం మీకు ఇచ్చేస్తానంటూ వేడుకున్నారు జస్టిస్ పీఎస్ నరసింహ.
ఎలక్షన్స్‌లో నగదు పాత్రను తగ్గించాల్సన అవసరం ఉందని సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. అలాగే ఎన్నికల బాండ్ల ద్వారా ఈ ఏడాది సెప్టెంబర్ 30 వరకు పార్టీలకు వచ్చిన విరాళాల వివరాలను సమర్పించాలని ఎన్నికల సంఘానికి ఆదేశాలు జారీ చేసింది.
మనీష్ సిసోడియా బెయిల్ పిటిషన్ ని సుప్రీం కోర్టు మరోసారి తిరస్కరించింది. ఈ కేసుకి సంబంధించి విచారణను ఆరు నెలలలోపు పూర్తి చేయాలని తెలిపింది. విచారణ నెమ్మదిగా సాగితే, సిసోడియా మూడు నెలల్లోపు మళ్లీ బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని సుప్రీం కోర్టు పేర్కొంది.
ఉత్తరప్రదేశ్‌లో ఓ అనూహ్య ఘటన చోటుచేసుకుంది. ఓ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్న ఓ వ్యక్తికి 28 ఏళ్ల తర్వాత ఆ ఉద్యోగం వచ్చింది. అంకుర్ గుప్తా అనే వ్యక్తి 1995లో తపాలాశాఖలో అసిస్టెంట్ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్నాడు. అతను మెరిట్ జాబితాలో చోటు సంపాదించుకుని ముందస్తు శిక్షణకు కూడా ఎంపికయ్యాడు. కానీ అతని విద్యార్హతల కారణంగా ఉద్యోగానికి అనర్హుడంటూ తపాలాశాఖ అంకుర్‌ను ఎంపికైన అభ్యర్థుల జాబితా నుంచి తొలగించింది. చివరికి ఈ వ్యవహారం సుప్రీంకోర్టుకు రావడంతో దీనిపై తాజాగా విచారణ జరిపిన ధర్మాసనం అతనికి నెలరోజుల్లో ఉద్యోగాన్ని ఇవ్వాలని తపాలాశాఖకు ఆదేశాలు జారీ చేసింది.
మురుగును శుభ్రం చేసే కార్మికులు మృతి చెందింతే వారి కుటుంబాలకు రూ.30 లక్షల ఆర్థిక సాయాన్ని ప్రకటించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. మాన్యువల్ స్కావెంజర్‌గా పని చేస్తూ శాశ్వత వైకల్యానికి గురైన బాధితులకు రూ.20లక్షలు పరిహారంగా ఇవ్వాలని సూచనలు చేసింది. అలాగే ఇతర రకాల వైకల్యానికి గురైన వారికి రూ.10లక్షల చొప్పున ఇవ్వాలని పేర్కొంది. ఈ వృత్తిలో కొనసాగేవారికి ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ప్రభుత్వ యంత్రాంగం చర్యలు తీసుకోవాలని తెలిపింది.
బీఆర్ఎస్ పార్టీకి ఓ ఊహించని షాక్ తగిలింది. ఎన్నికల గుర్తుల్లో కారును పోలి ఉన్న గుర్తులను రద్దు చేయాలంటూ ఇటీవలె బీఆర్ఎస్ సుప్రీంకోర్టులో రెండు పిటిషన్లను దాఖలు చేసింది. అయితే వీటిపై తాజాగా స్పందించిన అత్యున్నత న్యాయస్థానం ఈ రెండు పిటిషన్లను కొట్టివేసింది. మునుగోడు ఉపఎన్నికల్లో.. హైకోర్టు కొట్టివేసిన పిటిషన్‌పై ఆలస్యంగా వచ్చారని.. అధికార పార్టీ అయ్యుండి కూడా.. 240 రోజులు ఆలస్యంగా ఎలా వస్తారంటూ సుప్రీం ధర్మాసనం ప్రశ్నించింది. పిటిషన్‌పై విచారణ చేపట్టడం కుదరదని తేల్చి చెప్పింది. అయితే హైకోర్టుకు వెళ్లొచ్చని సూచించింది
ములాఖత్ ను పెంచాలని చంద్రబాబు వేసిన పిటిషన్‌ను ఏసీబీ కోర్టు తిరస్కరించింది. ప్రతివాదుల పేర్లు చేర్చకపోవడంతో ఇప్పుడు విచారణ అవసరం లేదని పిటీషన్ ఏసీబీ కోర్టు జడ్జి చెప్పారు. దాంతో పాటూ స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్ర బాబు వేసిన క్వాష్ పిటిషన్ తీర్పు వచ్చే నెల అంటే నవంబర్ 8కు సుప్రీంకోర్టు వాయిదా వేసింది. అలాగే ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ పై వాదనలు నవంబరు 9 న వింటామని ధర్మాసనం చెప్పింది.
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ ఇచ్చింది సుప్రీంకోర్టు ధర్మాసనం. ఎన్నికల గుర్తుల కేటాయింపునకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టేసింది. 'రోడ్డు రోలర్', 'చపాతి మేకర్' లాంటి ఎన్నికల గుర్తులను కేటాయుంచద్దని, ఆ మేరకు ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని సుప్రీంకోర్టుకు బీఆర్ఎస్ పిటిషన్ దాఖలు చేసింది. జస్టిస్ అభయ్ ఓకా నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిటిషన్‌ను విచారించింది. వాదనలు విన్న ధర్మాసనం.. బీఆర్ఎస్ వేసిన పిటిషన్‌ను కొట్టేసింది.
స్వలింగ వివాహాలకు నో చెబుతూ నిన్న సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. ఇలాంటి వివాహాలకు చట్టబద్ధత కల్పించలేమని చెప్పింది. స్వలింగ వివాహాం చేసుకున్న వారిని దంపతులుగా గుర్తించలేమని స్పష్టం చేసింది. అలా పెళ్ళి చేసుకోవడం వారి ప్రాథమిక హక్కు కాదని తెల్చి చెప్పింది. దీంతో భారత దేశంలో స్వలింగ సంపర్కులు తీవ్ర నిరాశ చెందారు. ఓ స్వలింగ జంట అయితే ఏకంగా కోర్టు ఎదుటే తమ నిరసనను తెలిపారు. ఉంగరాలు మార్చుకుని తమ నిశ్చితార్ధం చేసుకున్నారు.