Supreme Court: పెళ్లి ప్రతిపాదన కార్యరూపం దాల్చకపోవడం మోసం కాదు: సుప్రీంకోర్టు
పెళ్లి ప్రతిపాదన కార్యరూపం దాల్చకపోవడం మోసం కాదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. వివాహ ప్రతిపాదన మొదలై.. అది కార్యరూపం దాల్చకపోవడానికి అనేక కారణాలు ఉండొచ్చని పేర్కొంది. కర్ణాటకకు చెందిన వ్యక్తిపై నమోదైన చీటింగ్ కేసును సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది.