Patanjali : బాబారాందేవ్, బాలకృష్ణ బహిరంగ క్షమాపణలు చెప్పాలి.. పతంజలి కేసుపై సుప్రీంకోర్టు
పతంజలి సంస్థ ప్రజలను తప్పుదోవ పట్టించేలా మళ్లీ ప్రకటనలు చేయడంతో సుప్రీంకోర్టు మరోసారి చురకలంటించింది. గత ఉత్తర్వుల్లో కోర్టు ఏం చెప్పిందో తెలుసుకోలేనంత అమాయకులు మీరు కాదంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. వారం రోజుల్లోగా క్షమాపణలు చెప్పాలని ఆదేశించింది.