Under-19 : ఇంకొక్క అడుగే.. ప్రపంచకప్ ఫైనల్లో భారత్
అండర్-19 టీమ్ఇండియా జట్టు వరల్డ్ కప్ ఫైనల్కు దూసుకెళ్లింది. మంగళవారం ఉత్కంఠభరితంగా సాగిన సెమీస్లో ఆతిథ్య దక్షిణాఫ్రికాను భారత్ 2 వికెట్ల తేడాతో ఓడించి తుదిపోరుకు సిద్ధమైంది. అండర్-19 ప్రపంచకప్లో ఫైనల్ చేరడం భారత్కు ఇది వరుసగా అయిదోసారి కావడం విశేషం.