Terrorist Attack: హోటల్‌పై ఉగ్రవాదుల దాడి, 32 మంది మృతి
సోమాలియా రాజధాని మొగదిషులోని బీచ్ హోటల్‌పై జరిగిన దాడిలో 32 మంది మృతి చెందగా, 63 మంది గాయపడ్డారని సోమాలియా పోలీసులు తెలిపారు. ఈ దాడికి తామే బాధ్యులమని అల్-ఖైదా తూర్పు ఆఫ్రికా అనుబంధ సంస్థ అల్-షబాబ్ ప్రకటించింది. మృతుల్లో ఒక సైనికుడు కూడా ఉన్నాడు.