Universities: మళ్లీ యూనివర్సిటీల బాట పడుతున్న 40 ఏళ్ల పైబడినవారు
కొత్త నైపుణ్యాలు నేర్చుకునేందుకు సింగపూర్లో 40 ఏళ్లు దాటినవారు మళ్లీ యూనివర్సిటీల బాట పడుతున్నారు. వీరికోసం అక్కడ పూర్తికాల డిప్లొమా కోర్సును కూడా రూపొందించింది సింగపూర్ ప్రభుత్వం. అంతేకాదు.. 40 ఏళ్లు దాటిన వారు ఈ కోర్సులు చేసేందుకు 90 శాతం ఫీజు రాయితీ కూడా ఇస్తోంది.