Rahul Gandhi : రాహుల్ గాంధీ పోటీ చేస్తున్న స్థానానికి నేడు ఎన్నికలు...లోక్ సభ రెండో దశ పోలింగ్ ఈరోజే!
లోక్ సభ ఎన్నికల రెండో దశ పోలింగ్ శుక్రవారం ఏప్రిల్ 26న జరగనుంది. ఈ సారి ఎన్నికలు మొత్తంగా 13 రాష్ట్రాల్లోని 88 ఎంపీ స్థానాలకు నిర్వహించనున్నారు. ఉదయం ఏడు నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఎన్నికల ప్రక్రియను నిర్వహిస్తారు.