చావును జయించడం సైన్స్ తో సాధ్యమేనా?
పురాణాల్లో అమరత్వం ఓ కీలక పాత్ర పోషించింది. మరణం తన జోలికి రాకూడదని రాక్షసులు వరాలు కోరుకునేవారు. నిన్నమొన్నటి వరకూ ఈ ప్రయత్నం మానవమాత్రులకు అసాధ్యం అనుకునేవారు. కానీ కొన్ని పరిశోధనలు, సంఘటనలు పరిశీలించాక మనిషి చిరంజీవిగా మారగలడనే ఆశలు చిగురిస్తున్నాయి.