Varahi Yatra: సీఎం జగన్.. ఓ మూలన కూర్చోలేరా?: పవన్
Pawan Kalyan Varahi Yatra in Visakhapatnam: విశాఖపట్నంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 'వారాహి విజయ యాత్ర' కొనసాగుతోంది. ఇందుకు సంబంధించి విశాఖలో పవన్ కళ్యాణ్ ఎక్కడెక్కడ పర్యటించనున్నారో జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ షెడ్యూల్ రిలీజ్ చేశారు. నేటి నుంచి 17వ తేదీ వరకూ వైజాగ్ లో ఈ యాత్ర కొనసాతుందని వెల్లడించారు. శుక్రవారం విశాఖకు చెందిన పార్టీ ముఖ్య నాయకులతో మనోహర్ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా జగదాంబ కూడలిలో జరిగిన బహిరంగ సభ విజయవంతంపై ప్రతీఒక్కరినీ అభినందించారు. విశాఖ పరిధిలో పవన్ కళ్యాణ్ చేపట్టే కార్యక్రమాలను ప్రణాళికాబద్ధంగా చేపట్టాలని స్పష్టం చేశారు. ఆపై పవన్ పర్యటన షెడ్యూల్‌పై నేతలతో నాదెండ్ల చర్చించి ఖరారు చేశారు.