6 రాష్ట్రాల్లో ఉప ఎన్నికల నగారా..!

దేశంలో ఏడు అసెంబ్లీ నియోజక వర్గాల్లో ఉప ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆయా నియోజక వర్గాల్లో సెప్టెంబర్ 5న ఉప ఎన్నికలను నిర్వహించనున్నట్టు పేర్కొంది. సెప్లెంబర్ 8న ఓట్ల లెక్కింపు ప్రక్రియను చేపట్టనున్నట్టు తెలిపింది.

author-image
By G Ramu
New Update
6 రాష్ట్రాల్లో ఉప ఎన్నికల నగారా..!

దేశంలో ఏడు అసెంబ్లీ నియోజక వర్గాల్లో ఉప ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆయా నియోజక వర్గాల్లో సెప్టెంబర్ 5న ఉప ఎన్నికలను నిర్వహించనున్నట్టు పేర్కొంది. సెప్లెంబర్ 8న ఓట్ల లెక్కింపు ప్రక్రియను చేపట్టనున్నట్టు తెలిపింది.

త్రిపుర రాష్ట్రంలోని రెండు నియోజక వర్గాలకు, కేరళ, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో ఒక్కో నియోజక వర్గంలో ఎన్నికలు నిర్వహించనున్నట్టు ఎన్నికల సంఘం ప్రకటనలో పేర్కొంది. జార్ఖండ్‌లో దుమ్రీ నియోజక వర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే జగన్నాథ్ మహతో మరణంతో అక్కడ సీటు ఖాళీ అయింది.

ఈ క్రమంలో అక్కడ ఎన్నికలు నిర్వహించనున్నారు. త్రిపురలోని బొక్సానగర్ లో ఎమ్మెల్యే శాంసూల్ హక్వే మరణించగా, ధన్ పూర్ ఎమ్మెల్యే ప్రతిమా భౌమిక్ తన పదవికి రాజీనామా చేశారు. దీంతో ఆయా నియోజక వర్గాల్లో ఖాళీలు ఏర్పడ్డాయి.

పశ్చిమ బెంగాల్ లోని దూప్ గురిలో విష్ణు పాద రాయ్ మరణించగా అక్కడ ఉప ఎన్నికకు ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఇక యూపీలోని ఘోషి నియోజక వర్గం ఎస్పీ ఎమ్మెల్యే దారా సింగ్ చౌహన్ తన పదవికి రాజీనామా చేసి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే చందన్ రామ్ దాస్ మరణంతో భాఘేశ్వర్ అసెంబ్లీ సీటు ఖాళీ అయింది.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు