Runa Mafi: రైతు రుణమాఫీకి సాఫ్ట్వేర్ చిక్కులు.. అక్షరం తేడా ఉన్నా రద్దు!
సాంకేతిక లోపాల కారణంగా రుణమాఫీ ఆగిపోయిందని పలువురు రైతులు ఆందోళన చెందుతున్నారు. ఆధార్, రేషన్ కార్డు, బ్యాంక్ ఖాతాల్లో చిన్న అక్షరం తేడా ఉన్నా రుణమాఫి జాబితా నుంచి తమ పేర్లను తొలగించినట్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అర్హులకు కూడా అన్యాయం జరుగుతోందని వాపోతున్నారు.