MI vs GT: పాండ్యా కెప్టెన్సీలో బరిలోకి రోహిత్..! హిట్‌మ్యాన్ ఫ్యాన్స్ ఎమోషనల్!
ఇన్నాళ్లు ముంబై జట్టును ముందుండి నడిపించిన రోహిత్ ఈ సారి పాండ్యా కెప్టెన్సీలో ఓపెనర్‌గా బరిలోకి దిగనున్నాడు. దీంతో హిట్‌మ్యాన్ ఫ్యాన్స్ ఎమోషనల్ అవుతున్నారు. ఇవాళ గుజరాత్ వర్సెస్ ముంబై మ్యాచ్ ఉండగా.. ఈ గేమ్‌లో రోహిత్ చెలరేగి ఆడి, విమర్శకుల మూతి మూయించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.