Hundi: గుడి హుండీలో దొంగతనానికి యత్నం.. ఇరుక్కుపోయిన చెయ్యి
కామారెడ్డి జిల్లా రామేశ్వరపల్లిలో పోచమ్మ ఆలయంలో పనిచేస్తున్న సురేష్ అనే వ్యక్తి.. మంగళవారం రాత్రి హుండీలో డబ్బులు దొంగిలించేందుకు యత్నించాడు. కానీ అతడి చేయి హుండీలో ఇరుక్కుపోయి బయటికి రాలేదు. ఉదయం అతడిని చూసిన స్థానికులు కట్టర్ సాయంతో చేయి బయటికి తీశారు.