Crime News : కెనడాలో ముగ్గురు భారతీయులు మృతి
కెనడాలో ముగ్గురు భారతీయులు ప్రాణాలు కోల్పోవడం కలకలం రేపింది. పారిపోతున్న దొంగ కోసం పోలీసులు వెంబడించగా.. రోడ్డు ప్రమాదంలో భారత్‌కు చెందిన ఇద్దరు వృద్ధ దంపతులతో పాటు వాళ్ల మూడు నెలల మనుమడు మృతి చెందారు.
కెనడాలో ముగ్గురు భారతీయులు ప్రాణాలు కోల్పోవడం కలకలం రేపింది. పారిపోతున్న దొంగ కోసం పోలీసులు వెంబడించగా.. రోడ్డు ప్రమాదంలో భారత్‌కు చెందిన ఇద్దరు వృద్ధ దంపతులతో పాటు వాళ్ల మూడు నెలల మనుమడు మృతి చెందారు.
ముంబై-ఆగ్రా హైవేపై రాష్ట్ర రవాణా బస్సు ట్రక్కును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కనీసం 5 మంది మరణించారు. 41 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో 9 మంది పరిస్థితి విషమంగా ఉంది. మృతుల్లో ఇద్దరు వృద్దులు, 14 ఏళ్ల బాలుడు, ఇద్దరు పురుషులు, బస్సు కండక్టర్ ఉన్నారు.
దక్షిణామెరికాలోని పెరూలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు లోయలో పడి సుమారు 23 మంది ప్రయాణికులు మృతి చెందారు. మరో ఆరుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ప్రమాదం సోమవారం సాయంత్రం జరిగింది.
దేశ రాజధాని ఢిల్లీలో స్కూటర్ డివైడర్‌ను ఢీకొట్టడంతో ఢిల్లీ పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ మృతి చెందారు. మృతుడు ఎన్కే పవిత్రన్‌గా గుర్తించారు. మైదాన్ సొరంగం సమీపంలో స్కూటర్‌పై బ్యాలెన్స్ కోల్పోయి డివైడర్‌ను ఢీకొట్టడంతో ఈ సంఘటన జరిగిందని పోలీసులు తెలిపారు.
అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం రూరల్ మండలం భట్నవిల్లీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ, ఆటో ఢీ కొని నలుగురు యువకులు అక్కడిక్కడే మృతి చెందగా.. మరో నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి.
తెలంగాణ పోలీస్ శాఖలో విషాదం చోటుచేసుకుంది. శనివారం రాత్రి కామారెడ్డి జిల్లా తాడ్వాయి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో శ్రీనివాస్ గౌడ్ అనే హెడ్ కానిస్టేబుల్ మృతి చెందారు. ఆయన మృతి పట్ల పలువురు పోలీస్ ఉన్నతాధికారులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
అమెరికాలోని సౌత్ కరోనాలినాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయ మహిళలు మృతి చెందారు. వీళ్లందరూ గుజరాత్‌లోని ఆనంద్ జిల్లాకు చెందినట్లుగా అధికారులు చెప్పారు. పరిమితికి మించి వేగంతో వెల్లడంతోనే కారు అదుపుతప్పి ఈ ప్రమాదం జరిగిందని పేర్కొన్నారు.
సంగారెడ్డి జిల్లా ముత్తంగి ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రహదారిపై వేగంగా వస్తున్న కారు.. ఆగిఉన్న ఓ లారీని ఢీకొనడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో కారు, లారీ దగ్ధం కావడంతో ఒకరు మంటల్లో చిక్కుకుని సజీవ దహనం అయినట్లు తెలుస్తోంది.