Telangana: ఘోర రోడ్డు ప్రమాదం.. అయిదుగురు దుర్మరణం..
నల్గొండ జిల్లా మిర్యాలగూడలోని అద్దంకి-నార్కట్పల్లి ప్రధాన రహదారిపై ఆదివారం అర్ధరాత్రి వేగంగా వస్తున్న లారీ వెనకనుంచి ఓ కారును ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో కారులో ప్రయాణిస్తున్న రెండు కుటుంబాలకు చెందిన అయిదుగురు మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు.