Annamayya District : అన్నమయ్య జిల్లా నందలూరులో కడప – చెన్నై జాతీయ రహదారి (Kadapa-Chennai National Highway) పై ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) చోటుచేసుకుంది. ఆర్టీసీ బస్సు, లారీ ఢీకొనడంతో.. లారీ డ్రైవర్, బస్సు కండక్టర్ అక్కడిక్కడే మృతి చెందారు. ప్రమాదం జరిగిన వెంటనే బస్సులో నుంచి దిగే క్రమంలో ఇనుప మూటపడి కండక్టర్ మృతి చెందారు. మరో 15 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను హుటాహుటిన రాజంపేట ప్రభుత్వాసుపత్రి (Rajampet Government Hospital) కి తరలించారు. లారీ డ్రైవర్ తప్పిదం వల్లే రోడ్డు ప్రమాదం జరిగిందని పోలీసులు భావిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.
పూర్తిగా చదవండి..Andhra Pradesh : ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి
అన్నమయ్య జిల్లా నందలూరులో కడప - చెన్నై జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆర్టీసీ బస్సు, లారీ ఢీకొనడంతో.. లారీ డ్రైవర్, బస్సు కండక్టర్ అక్కడిక్కడే మృతి చెందారు. మరో 15 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను రాజంపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
Translate this News: