రాజకీయాలు Abhilasha Rao: కాంగ్రెస్ కు షాకిచ్చిన కీలకనేత..పార్టీకి రాజీనామా! కాంగ్రెస్ కు బిగ్ షాక్ . ఆ పార్టీ సీనియర్ నేత పీసీసీ ప్రధాన కార్యదర్శి అభిలాష్ రావు తన పదవికి, పార్టీ సభ్యత్వానికి శనివారం ఉదయం రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి ఆయన పంపారు. ఆయన త్వరలోనే అధికారపార్టీలోకి చేరే అవకాశాలున్నట్టుగా ప్రచారం జోరుగా సాగుతోంది. మరోవైపు సీనియర్ నేత జగదీశ్వర్ రావ్ కూడా తనకు పార్టీ టికెట్ ఇవ్వకపోతే.. ఇండిపెండెంట్ గా బరిలోకి దిగాలని చూస్తున్నారు. మొత్తానికి ఈ పరిణామాలతో కొల్లాపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి తిప్పలు తప్పేట్టుగా లేవు... By P. Sonika Chandra 26 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు MLC Kavitha:తెలంగాణ అభివృద్ధి పథంలో దూసుకుపోతోంది సీఎం కేసీఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతోందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఆర్మూర్‌లో నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న ఆమె.. బీఆర్ఎస్ కార్యకర్తలు ప్రజల్లో ఉండాలని పిలుపునిచ్చారు. పార్టీకోసం కష్టపడ్డవారికి తగిన ప్రాధాన్యత ఉంటుందని సూచించారు. By Karthik 25 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Congress: కొడంగల్ నుంచే పోటీ చేస్తా.. కాస్కో.. రేవంత్ రెడ్డి సవాల్.. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పోటీ చేసే నియోజకవర్గంపై క్లారిటీ వచ్చింది. గతంలో ప్రాతినిధ్యం వహించిన కొడంగల్ నుంచే తాను ఎమ్మెల్యే టికెట్ కోసం దరఖాస్తు చేస్తున్నట్లు రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఇక్కడి ప్రజలతో తనకు విడదీయరాని అనుబంధం ఉందన్న రేవంత్.. నియోజకవర్గం అభివృద్ధే తన తొలి ప్రాధాన్యతగా చెప్పుకొచ్చారు. బీఆర్ఎస్ బెదిరింపులకు తమ కార్యకర్తలు ఎవరూ బెదరబోరన్నారు. By Amar 24 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Revanth Reddy:ఇలాంటి పాలన పై “తిరగబడదాం - తరిమికొడదాం”.. రేవంత్ రెడ్డి!! టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కేసీఆర్ సర్కార్ పై మరోసారి మండిపడ్డారు. విశ్వనగరంగా చేశానని కేసీఆర్ గప్పాలు కొట్టే మన హైదరాబాద్.. బీఆర్ఎస్ పాలనలో గంజాయికి, మత్తు పదార్థాలకు అడ్డాగా మారిందని ఆయన ఫైర్ అయ్యారు. నిన్న సింగరేణి కాలనీలో, నేడు మీర్ పేటలో ఆడబిడ్డల పై అఘాయిత్యాలు కలచివేస్తున్నాయన్నారు. పోలీసు వ్యవస్థను రాజకీయ ప్రయోజనాలకు వాడుకుని… ప్రజల మానప్రాణాలను గాలికి వదిలేశారని రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు.. By P. Sonika Chandra 22 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Telangana Elections: ఇదేనా 80వేల పుస్తకాలు చదివిన జ్ఞానం.. అభ్యర్థుల లిస్ట్‌పై మాటల మంటలు! సీఎం కేసీఆర్ టార్గెట్‌గా కాంగ్రెస్, బీజేపీ, కమ్యూనిస్టులు, YSRTP.. ఇలా అన్ని పార్టీల నేతలు ఫైర్ అయ్యారు. అభద్రత భావంతోనే రెండు చోట్ల పోటీకి కేసిఆర్ సిద్ధమయ్యారని బీజేపి జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ కామెంట్స్ చేయగా.. కేసీఆర్ అహంకారం నవంబర్‌లో పోతుందంటూ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్‌చుగ్ విమర్శలు గుప్పించారు. 2014 కంటే ముందు జరిగిన ప్రతీ పాపంలో నువ్వు(కేసీఆర్) ప్రత్యక్ష భాగస్వామివంటూ రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. By Trinath 21 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు VH:త్వరలో బీసీ గర్జన కార్యక్రమం చేపడుతాం తెలంగాణలో ఎలక్షన్ హీట్ పెరిగిపోయింది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించగా.. బీసీ ప్రతిపాధికన సీట్ల కేటాయింపు ఉంటుందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వీ హనుమంతరావు అన్నారు. By Karthik 19 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు కోకాపేట, బుద్వెల్ లో భూములు కొన్నది కేసీఆర్ బీనామీలే.. రేవంత్ సంచలన వ్యాఖ్యలు Revanth Reddy Sensational Comments On KCR: రేవంత్ మీడియాతో చిట్ చాట్ చేశారు. తనకు సెక్యూరిటీ తగ్గించటం దగ్గర నుంచి, బీఆర్ఎస్, బీజేపీల బంధం గురించి మాట్లాడారు. తెలంగాణలో రియల్ ఎస్టేట్ బూమ్ గురించి ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. By Pardha Saradhi 18 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Syed Zafar Islam: బీజేపీ గ్రాఫ్‌పై తప్పుడు ప్రచారం వద్దు తెలంగాణలో బీజేపీ గ్రాఫ్ పడిపోతుందని విపక్ష పార్టీలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని బీజేపీ అధికార ప్రతినిధి సయ్యర్ జాఫర్ ఇస్లామ్ ఆరోపించారు. తెలంగాణలో ఎన్నికల ఫలితాలు వచ్చాక కాంగ్రెస్ పార్టీ స్థాయి ఏదో బీజేపీ పార్టీ స్థాయి ఏదో తెలుస్తుందన్నారు. ఎన్నికల అనంతరం టీపీసీసీ చీఫ్ జైలుకు వెళ్లడం ఖాయమన్నారు. By Karthik 17 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Case on Revanth Reddy: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై కేసు నమోదు! టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలపై పోలీసు అసోసియేషన్ సీరియస్ అయ్యింది. దీంతో ఆయనపై నాగర్ కర్నూల్ పోలీసు స్టేషన్లో పోలీస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గోవర్ధన్ పట్వారి ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు అయింది. కాగా, పోలీసులు అధికార పార్టీకి వత్తాసు పలుకుతున్నారని ఆయన ఆరోపణలు చేశారు. బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ ఇస్తున్న పోలీసుల పేర్లు రెడ్ డైరీలో రాసి పెట్టుకుంటామని.. కాంగ్రెస్ రానున్న ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత వారికి మిత్తితో సహా కలిపి ఇస్తామన్నారు... By P. Sonika Chandra 15 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn