DSC: నేటి నుంచి డీఎస్సీ అభ్యర్థుల సర్టిఫికేట్ వెరిఫికేషన్!
అక్టోబర్ 1 నుండి అక్టోబర్ 5 మధ్య డీఎస్సీ క్వాలిఫై అయిన అభ్యర్థుల సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రక్రియ జరగనున్నట్లు సమాచారం. ప్రతి రోజు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఈ వెరిఫికేషన్ జరగనుంది.
HYDRA : వ్యూహం మార్చిన రేవంత్ సర్కార్.. మూసీ కూల్చివేతలపై కొత్త ప్లాన్ ఇదే!
మూసీ కూల్చివేతలపై రేవంత్ సర్కార్ వ్యూహం మార్చినట్లు తెలుస్తోంది. వివాదాలకు పోకుండా సాధ్యమైనంత సామరస్యంగా నిర్వాసితులను ఒప్పించడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు క్షేత్ర స్థాయి అధికారులకు ఆదేశాలు కూడా వెళ్లినట్లు సమాచారం.
R. Krishnaiah : జగన్‌కు రేవంత్ షాక్... కాంగ్రెస్‌లోకి ఆర్.కృష్ణయ్య!
వైసీపీకి రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన ఆర్. కృష్ణయ్య కాంగ్రెస్‌లో చేరనున్నట్లు తెలుస్తోంది. ఈరోజు ఆయనను ఎంపీ మల్లు రవి కలిశారు. కాంగ్రెస్ పార్టీలో చేరాలని ఆయనను ఆహ్వానించారు. కాగా ఆయన ఈరోజు లేదా రేపు కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నట్లు సమాచారం.
Ration Cards : 15 లక్షల రేషన్ కార్డులు రద్దు?
TG: రాష్ట్రంలో సుమారు 15 లక్షల రేషన్‌కార్డులను రద్దు చేసే ఆలోచలనో రేవంత్ సర్కార్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ–కేవైసీ ప్రక్రియకు హాజరు కాకపోవడంతో వారందరినీ అనర్హులుగా గుర్తించింది. అక్టోబర్ నుంచి కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు స్వీకరించనుంది.
Revanth:మొగిలయ్యకు హైదరాబాద్ లో ఇంటి స్థలం.. రేవంత్ సర్కార్ భారీ సాయం!
ప్రముఖ కిన్నెర వాయిద్యకారుడు పద్మశ్రీ దర్శనం మొగిలయ్యకు రేవంత్ సర్కార్ శుభవార్త చెప్పింది. హైదరాబాద్ లోని హయత్ నగర్ లో 600 గజాల ఇంటి స్థలాన్ని కేటాయించింది. ఇందుకు సంబంధించిన ధ్రువపత్రాలను సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు మొగిలయ్యకు అందించారు.
Paralympics విజేతకు గ్రూప్-2 ఉద్యోగం, రూ.కోటి బహుమతిగా ఇచ్చిన సీఎం!
పారాలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన తెలంగాణ యువ అథ్లెట్ దీప్తి జీవాంజికి భారీ నగదు బహుమతి అందించారు సీఎం రేవంత్. జీవాంజికి కోటి రూపాయల చెక్ ఇచ్చిన అనంతరం గ్రూప్-2 ఉద్యోగం, వరంగల్‌లో 500 గజాల స్థలం కేటాయించారు. కోచ్ కు రూ.10లక్షలు ఇచ్చారు.
కాంగ్రెస్ లోకి మహేష్ బాబు.. వైరల్ అవుతున్న వీడియో
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని మహేష్ కలిసిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూసిన కొందరు ఫ్యాన్స్.. 'తరం మారిన.. కాంగ్రెస్ రక్తం మారదు'. అప్పట్లో తండ్రి, ఇప్పుడు తనయుడు.. ఇద్దరూ కాంగ్రెస్ కు మద్దతుగా ఉన్నారని కామెంట్స్ పెడుతున్నారు.
Namrata Shirodkar: సీతక్క నేను మీ అభిమానిని..! ఫొటో అడిగిన నమ్రత
మహేష్ బాబు దంపతులు సీఎం రేవంత్ రెడ్డిని స్వయంగా ఆయన నివాసంలో కలిసి వరద బాధితుల కోసం రూ. 60 లక్షల చెక్కు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సీతక్క కూడా కలిసిన నమ్రత ఆమెతో కలిసి ఫొటోలు దిగారు. సీతక్కకు తాను అభిమానిని అంటూ చెప్పారు.