Forex Reserves: దేశంలో రికార్డు స్థాయికి చేరిన ఫారెక్స్ నిల్వలు.. బంగారం కూడా బోలెడు ఉంది!
దేశంలో ఫారెక్స్(విదేశీ మారక ద్రవ్యం) నిల్వలు రికార్డ్ స్థాయికి చేరుకున్నాయి. మరోవైపు బంగారం నిల్వలు కూడా బాగా పెరిగాయి. ఈ విషయాన్ని ఆర్బీఐ వెల్లడించింది. మన ఫారెక్స్ నిల్వలు జూలై 5 నాటికి 5.16 బిలియన్ డాలర్లు పెరిగి 657.16 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి.