Aishwarya: మేమూ మనుషులమే.. మాకూ భావోద్వేగాలుంటాయి.. రజనీ కూతురు
తండ్రి రజనీకాంత్ పై సోషల్ మీడియాలో నెగిటివ్ ప్రచారం జరగడంపై ఆయన కూతురు, డైరెక్టర్ ఐశ్వర్య స్పందించింది. 'మేమూ మనుషులమే. మాకూ భావోద్వేగాలుంటాయి. ఈ మధ్యకాలంలో నా తండ్రిని ‘సంఘీ’ అంటూ విమర్శలు చేస్తున్నారు. రజనీకాంత్ సంఘీ కాదు' అంటూ ఎమోషనల్ అయింది.