Rajinikanth: సంక్రాంతి బరిలో సూపర్ స్టార్
అగ్ర హీరోలతో భారీ బడ్జెట్ సినిమాలను నిర్మించి పాపులర్ అయింది ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్. ఈ బ్యానర్‌పై ఎన్నో క్రేజీ ప్రాజెక్ట్స్ వచ్చాయి.
అగ్ర హీరోలతో భారీ బడ్జెట్ సినిమాలను నిర్మించి పాపులర్ అయింది ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్. ఈ బ్యానర్‌పై ఎన్నో క్రేజీ ప్రాజెక్ట్స్ వచ్చాయి.
ఎంత ఎదిగినా అంత ఒదిగి వుండే వ్యక్తి సూపర్ స్టార్ రజనీ కాంత్. ఆసియాలోనే టాప్ హీరోల్లో ఒకరిగా వున్నా అత్యంత సాధారణ వ్యక్తిలా ఉండటం ఆయనకు మాత్రమే సాధ్యం. మనం ఏ స్థాయిలో వున్నా మన మూలాలను మరచి పోకూడదని నమ్మే వ్యక్తి ఆయన. అందుకే ఆయన సూపర్ స్టార్ స్థాయిలో వున్న తన పాత రోజులను మరచి పోలేదు. అందుకే కర్ణాకటలో తాను కండక్టర్ గా పని చేసిన బస్సు డిపోకు వెళ్లారు.
సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన జైలర్ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబడుతోంది. తాజాగా, సినిమా ప్రమోషన్‌కు సంబంధించి లక్నో వెళ్లిన తలైవా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను కలుసుకుని ఆయన పాదాలను తాకారు. దీంతో నెటిజన్లు ట్రోల్ చేశారు. రజనీకాంత్, యోగి ఆదిత్య నాథ్ పాదాలను తాకడం సరికాదని కామెంట్లు చేశారు. దీనికి సంబంధించి ట్రోలర్లకు తలైవా సమాధానం ఇచ్చారు.
విడుదలైన తొమ్మిది రోజులకే రజినీకాంత్ ‘జైలర్’ సినిమా రూ.500 కోట్ల క్లబ్బులో అడుగు పెట్టింది. కేవలం 6 రోజుల్లో, ఈ చిత్రం తమిళనాడు, కేరళ, కర్ణాటక, తెలుగు రాష్ట్రాలు, ఓవర్సీస్లో బ్రేక్ఈవెన్ సాధించింది. వరుసగా ఫ్లాపులు చూసిన సన్ పిక్చర్స్‌కు ఈ సినిమా కాసుల వర్షం కురిపిస్తోంది. అంతేకాదు.. 500 కోట్ల క్లబ్ లో సన్ పిక్చర్స్ నుంచి చేరిన తొలి సినిమా ఇదే కావడం విశేషం.
సూపర్ స్టార్ రజనీకాంత్ జైలర్ మూవీ సక్సెస్ ను ఆస్వాదిస్తున్నారు. ఇందులో భాగంగానే బద్రినాథ్ ఆలయాన్ని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు రజనీకాంత్. సూపర్ స్టార్ బద్రినాథ్ ను దర్శించుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
భోళాశంకర్ వచ్చింది, ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమా కంటే 24 గంటల ముందు జైలర్ వచ్చింది. ఎబోవ్ యావరేజ్ టాక్ తెచ్చుకుంది. ఇప్పుడు భోళాశంకర్ సినిమా చూసిన జనాలు, జైలర్ బాగుందంటున్నారు. అలా భోళాశంకర్ చలవతో, జైలర్ సినిమా క్లిక్ అయింది. దీంతో ఈ సినిమాకు ఇప్పుడు మరిన్ని థియేటర్లు కేటాయించబోతున్నారు.
జపాన్ లో రజనీ సినిమాలకు ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు. భారతదేశంలో విడుదలయిన ప్రతి రజనీ సినిమాను జపనీయులు ఆదరిస్తూంటారు. రజనీ సినిమా విడుదలయితే థియేటర్లు కిక్కిరిసిపోతాయి. ఈలలు, కేకలతో అక్కడ సందడి నెలకొని ఉంటుంది. రజనీ నటించిన భాషా, ముత్తు సినిమాలంటే అక్కడ వాళ్లకు పిచ్చి ఇష్టం. జపాన్ అత్యధిక కలెక్షన్లు రాబట్టిన భారతీయ చిత్రం రికార్డు రెండు దశాబ్దాలుగా రజనీకి చెందిన ముత్తుకే ఉంది.
August Movie Release Dates | ఆగస్ట్ నెల.. వారానికో మెగా మూవీ - భోళాశంకర్ , ఆదికేశవ , గాండీవధారి అర్జున, ఉస్తాద్
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్, మిల్కీ బ్యూటీ తమన్నా జంటగా నటించిన లేటెస్ట్ మూవీ జైలర్. నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్ లో సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ మూవీలో రమ్యకృష్ణ, సునీలో, సంజయ్ దత్, జాకీష్రాప్, శివరాజ్ కుమార్, మోహన్ లాల్, ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.