Karnataka : బెంగళూరుకు ఎల్లో అలెర్ట్..వారం రోజులపాటూ భారీ వర్షాలు
బెంగళూరును వారం రోజుల పాటూ భారీ వర్షాలు ముంచెత్తనున్నాయి అంటోంది భారత వాతావరణశాఖ. బలమైన గాలులు, విపరీతమైన వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ ఎల్లో అలెర్ట్ హెచ్చరికను జారీ చేసింది.
బెంగళూరును వారం రోజుల పాటూ భారీ వర్షాలు ముంచెత్తనున్నాయి అంటోంది భారత వాతావరణశాఖ. బలమైన గాలులు, విపరీతమైన వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ ఎల్లో అలెర్ట్ హెచ్చరికను జారీ చేసింది.
ఉపరితల ద్రోణి ప్రభావంతో ఏపీలో బుధవారం వర్షాలు పడతాయిని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు వెల్లడించారు. శ్రీకాకుళం, నెల్లూరు, బాపట్ల, అల్లూరి, చిత్తూరు, పల్నాడు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లో బుధవారం పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు వివరించారు.
ఎండలకు మలమలామాడిపోతున్న తెలుగు రాష్టాలకు గుడ్ న్యూస్చెప్పింది వాతావరణ శాఖ. మండే ఎండల నుంచి ఉపశమనం ఇస్తూ ఈ నెల 5 తర్వాత వాతావరణం చల్లబడనుంది. మూడురోజుల పాటూ వర్షాలు పడే ఛాన్స్ ఉందని చెప్పింది.
క్రితంసారి పడిన వర్షాలకు దుబాయ్ ఇంకా తేరుకోనే లేదు ఇప్పుడు మళ్ళీ ఆ దేశాన్ని వానలు, వరదలు ముంచెత్తాయి. నగరంలో పలు ప్రాంతాలు భారీ వరదల నీటిలో మునిగిపోయాయి. దీంతో అక్కడి జనజీవనం అస్తవ్యస్తం అవడంతో పాటూ మళ్ళీ పలు విమానాలు రద్దు అయ్యాయి.
భారీ వర్షాలు, వరదలు ఒకదాని తర్వాత ఒకటిగా ప్ద్రపంచ దేశాలను ముంచెత్తుతున్నాయి. దుబాయ్, చైనా, కెన్యాల తరువాత ఇప్పుడు బ్రెజిల్ వరదలో కొట్టుకుపోయింది. దారుణంగా వచ్చిన ఫ్లడ్కు 100 మంది పైగా మృతి చెందారు.
ఆఫ్రికా దేశమైన కెన్యాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఓ డ్యామ్ కూలి సుమారు 42 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయం గురించి స్థానిక అధికారులు సమాచారం అందించారు. .
వర్షాల వల్ల నైజీరియాలోని ఓ జైలు గోడలు దెబ్బతినడంతో సుమారు 118 మంది ఖైదీలు జైలు నుంచి పరారయ్యారు. దేశ రాజధాని అబూజ సమీపంలోని సులేజాలో రాత్రి భారీ వర్షాలు కురిశాయి. దీంతో పట్టణంలోని జైలు ప్రహరీ గోడలతోపాటు పలు భవనాలు దెబ్బతిన్నాయి.
అకాల వర్షాలు, భారీ వరదలు ప్రపంచాన్ని భయపెడుతున్నాయి. దుబాయ్ ,చైనాలను వణికించిన భారీ వర్షాలు ఇప్పుడు కెన్యాను అతలాకుతలం చేశాయి. దీని ధాటికి ఇప్పటికి వరకు 38 మంది ప్రాణాలు కోల్పోయారు.