Rains : మరో మూడు రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు!
తెలంగాణ రాష్ట్రంలో మరో మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశాలున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. మెరుపులు, ఉరుములు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.