Rains : తెలంగాణ వాసులకు చల్లని కబురు... రేపట్నుంచి వానలు!
ప్రజలకు వాతావరణ శాఖ హైదరాబాద్ విభాగం చల్లటి కబురు మోసుకొచ్చింది. ఈ నెల 7 నుంచి అంటే ఆదివారం నుంచి తెలంగాణలో పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని అధికారులు వివరించారు. మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడతాయని అధికారులు తెలిపారు.