Mansoon : జూన్ మొదటి వారంలోగా తెలంగాణలోకి నైరుతి రుతుపవనాలు!
జూన్ మొదటి వారంలో తెలంగాణలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించనున్నట్లు వాతావరణశాఖాధికారులు తెలిపారు. మే నెలాఖారుకే కేరళను రుతుపవనాలు తాకనున్నట్లు అధికారులు వివరించారు. కేరళ నుంచి ఏపీలోని రాయలసీమ మీదుగా తెలంగాణను చేరుకోవడానికి కనీసం అయిదారు రోజుల సమయం పడుతుంది.