/rtv/media/media_files/2025/08/30/governor-quota-mlc-candidates-selected-2025-08-30-15-22-25.jpg)
Governor's quota MLC candidates selected
Big breaking : రాష్ట్రంలో ఖాళీగా ఉన్న గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక విషయంలో అధికార పార్టీ బిగ్‌ట్విస్ట్ ఇచ్చింది. గతంలో ఎమ్మెల్సీలుగా కోదండరాం, అమీర్‌ఆలీఖాన్‌లను ప్రభుత్వం ఎంపిక చేసింది. అయితే సుప్రీం కోర్టు వారి నియమకాన్ని రద్దు చేయడంతో తిరిగి ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. అయితే కోదండరాంతో పాటు ఈసారి అమీర్ ఆలీఖాన్‌ను తప్పించి ఆయన స్థానంలో అజారుద్దీన్‌ను సిఫారసు చేసింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో అజారుద్దీన్‌కు ఎమ్మెల్సీ కేటాయించడం సంచలనంగా మారింది. సుప్రీంకోర్టు తీర్పుతో మరోసారి క్యాబినెట్ అమోదంతో అజారుద్దీన్, కోదండరామ్‌లను సిపారసు చేసింది. కాగా గత అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ టికెట్‌ను అజారుద్దీన్ కు కెటాయించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఉప ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అజారుద్దీన్‌కు ఎమ్మెల్సీ కేటాయించడంతో ఆయనక జూబ్లీహిల్స్ టికెట్ లేదని తేల్చి చెప్పినట్లయింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Also Read : మండపం వద్ద పాటలు పెడుతుండగా కరెంట్ షాక్.. నల్గొండలో పెను విషాదం!