TS Politics: బీఆర్ఎస్ లో చేరిక పై కాసాని జ్ఞానేశ్వర్ కీలక ప్రకటన
కాసాని జ్ఞానేశ్వర్ బీఆర్ఎస్ లో చేరుతారంటూ గత రెండు, మూడు రోజులుగా జోరుగా ప్రచారం సాగుతోన్న విషయం తెలిసిందే. అయితే.. ఈ వార్తలపై ఆయన స్పందించారు. తనకు ఏ పార్టీ నుంచి పిలుపు రాలేదని తేల్చిచెప్పారు. రానున్న తెలంగాణ ఎన్నికల్లో టీడీపీ అన్ని స్థానాల్లో పోటీ చేస్తుందని ఆయన స్పష్టం చేశారు.