IndependenceDay2023: మణిపూర్ శాంతి స్థాపనకు కేంద్రం సహకరిస్తుంది..ఎర్రకోట వేదికగా మోదీ.!
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా తన ప్రసంగంలో మణిపూర్ హింసను కూడా ప్రధాని మోదీ ప్రస్తావించారు. దేశం మణిపూర్ ప్రజల వెంటే ఉందని ప్రధాని మోదీ అన్నారు. సమస్య పరిష్కారానికి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. తల్లులు, కూతుళ్ల గౌరవానికి గండి పడిందని మోదీ అన్నారు.