Osmania University: ఓయూలో కరెంట్, తాగునీటి కొరత.. డిప్యూటీ సీఎం సంచలన ప్రకటన!
ఉస్మానియా యూనివర్సిటీలో కరెంట్, తాగునీటి కొరతపై డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క స్పందించారు. చీఫ్ వార్డెన్ తప్పుడు ప్రకటన చేశారని అన్నారు. విద్యార్థులు ఖాళీ చేయాల్సిన అవసరం లేదని, నిశ్చింతగా చదువుకోవాలని కోరారు. వార్డెన్ కు షోకాజ్ నోటీసు ఇచ్చారు.