OU: ఓయూ డిగ్రీ పరీక్ష తేదీలు ఖరారు.. షెడ్యూల్ రిలీజ్ ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని వివిధ కోర్సుల పరీక్షా తేదీలు వెలువడ్డాయి. డిగ్రీ మొదటి, మూడు, ఐదొవ సెమిస్టర్ రెగ్యూలర్ పరీక్షలను ఫిబ్రవరి 3వ తేదినుంచి నిర్వహించనున్నట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ రాములు తెలిపారు. By srinivas 23 Jan 2024 in జాబ్స్ Latest News In Telugu New Update షేర్ చేయండి OU: ఉస్మానియా యూనివర్సిటీ (Osmania University) పరిధిలోని వివిధ కోర్సుల పరీక్షా(examination) తేదీలు వెలువడ్డాయి. ఈ మేరకు యూనివర్సిటీ పరిధిలోని బీఏ (ఓరియంటల్ లాంగ్వెజెస్) పరీక్షా తేదీలను ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ రాములు అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు కోర్సులను అనుసరించి మొదటి, మూడు, ఐదొవ సెమిస్టర్ రెగ్యూలర్ పరీక్షలను ఫిబ్రవరి 3వ తేదినుంచి నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇది కూడా చదవండి: TSPSC: అదనపు పోస్టులతో ఫిబ్రవరిలో గ్రూప్-1 నోటిఫికేషన్?.. సిలబస్ ఇదే అలాగే మూడేళ్ల ఎల్ఎల్బీ, మూడేళ్ల ఎల్ఎల్బీ ఆనర్స్ కోర్సుల రెండు, మూడో సంవత్సరం మొదటి సెమిస్టర్ రెగ్యులర్, ఐదేళ్ల బీఏ ఎల్ఎల్బీ, ఐదేళ్ల బీబీఏ ఎల్ఎల్బీ, ఐదేళ్ల బీకామ్ ఎల్ఎల్బీ రెండు, మూడు, నాలుగు, అయిదో సంవత్సరం మొదటి సెమిస్టర్ పరీక్షలను ఈ నెల 23వ తేదీ నుంచి, ఎల్ఎల్ఎం మూడో సెమిస్టర్ పరీక్షలను ఈ నెల 27వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. పరీక్షా తేదీల పూర్తి వివరాలకు ఓయూ వెబ్ సైట్ www.osmania.ac.in సంప్రదించాలని అధికారులు సూచించారు. #examination #dates #osmania-university మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి