AP: ఒంగోలులో గంజాయి ముఠా అరెస్ట్..!
ఒంగోలులో గంజాయి ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులను నుంచి 40 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఎవరైనా సరే గంజాయి అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవని పోలీస్ అధికారులు హెచ్చరించారు.
ఒంగోలులో గంజాయి ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులను నుంచి 40 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఎవరైనా సరే గంజాయి అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవని పోలీస్ అధికారులు హెచ్చరించారు.
చీరాలలో రెండు దశాబ్దాలుగా జరిగిన ప్రతి అవినీతిలో ఆమంచి సోదురుల హస్తం ఉందన్నారు కేసుల బాధితుడు నాగార్జున రెడ్డి. ప్రశ్నిస్తే బౌధిక దాడులు చేయడం, కేసులు పెట్టడం, అడ్డుతొలగించడమే వారికీ తెలుసని సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై వస్తున్న ఆరోపణలు కేవలం కొంతమంది సృష్టించినవేనన్నారు.
ప్రకాశం జిల్లా ఒంగోలు కలక్టరేట్ వద్ద AISF ఆధ్వర్యంలో విభిన్న ప్రతిభావంతులు నిరసన చేపట్టారు. 10 వేల మంది అంద విద్యార్థులు ఉండగా కేవలం 2000 మందికే పాఠ్య పుస్తకాలు అందించారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. MD కుమార్ రాజాపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా పర్యటించారు. ముటుకులలో ఉన్న సమ్మర్ స్టోరేజీ వాటర్ ట్యాంకును పరిశీలించి నీటి సరఫరా విధానంపై ఆరా తీశారు. 23 గ్రామాలకు ఇదే ప్రధాన నీటి వనరుగా అధికారులు వివరించారు.
ఆంధ్రకేసరి యూనివర్సిటీ నూతన వైస్ ఛాన్సలర్ గా ప్రొఫెసర్ DVR మూర్తి బాధ్యతలు తీసుకున్నారు. ఆంధ్రా యూనివర్సిటీ నుండి వచ్చిన మూర్తికి యూనివర్సిటీ సిబ్బంది సాదర స్వాగతం పలికారు. అన్నివిధాల యూనివర్సిటీ అభివృద్ధికి కృషి చేస్తానని, ఇచ్చిన బాధ్యత నెరవేరుస్తానని ఆయన అన్నారు.
ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా పోటీచేసి ఓటమిపాలైన చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని వైసీపీ జిల్లా అధ్యక్షుడిగా నియమించేందుకు పార్టీ అధిష్టానం యోచిస్తుంది.అదే జరిగితే తాను పార్టీ వీడటానికైనా సిద్దమని వైసీపీ పెద్దలకు బాలినేని శ్రీనివాసరెడ్డి స్పష్టం చేసినట్లు సమాచారం.
ఒంగోలు వినయ్ జూనియర్ కాలేజిలో విద్యార్థులు దుర్మార్గంగా ప్రవర్తించారు. సర్టిఫికేట్ల కోసం వచ్చిన ఒక విద్యార్థిని ముగ్గురు విద్యార్థులు కలిసి చితకబాదారు. ఈ దృశ్యాలు అక్కడ ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అవడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
రోజురోజుకు పెరుగుతున్న నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు ప్రకాశం జిల్లా ఎస్పీ గురుడ్ సుమిత్ సునీల్. వివిధ ప్రాంతాల్లో పోగొట్టుకొన్న 361 మొబైల్ ఫోన్స్ ని రికవరీ చేయడంతో పాటు ఇద్దరినీ అరెస్ట్ చేసినట్లు తెలిపారు.
అస్సాం శివసాగర్‌లో దారుణం చోటుచేసుకుంది. ప్రవర్తన మార్చుకోమని మందలించాడని ప్రిన్సిపాల్ రాజేష్‌ను ఓ విద్యార్థి కత్తితో దాడి చేసి హత్య చేశాడు. హత్య చేయడంతో పాటు ఆన్లైన్ ద్వారా తానే చేశానని విద్యార్థి చెప్పాడు. ఒంగోలుకి చెందిన మృతుడు రాజేష్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.