AP: ప్రోటోకాల్ రగడ.. ఎంపీ వర్గీయులు ఆగ్రహం..!

ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో ప్రోటోకాల్ వివాదం నెలకొంది. టీడీపీలో అంతర్గత విభేదాలు మరోసారి బయటపడ్డాయి. NTR పెన్షన్ పంపిణీ కార్యక్రమం ఫ్లెక్సీలలో ఒంగోలు MP మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఫొటో కనిపించలేదు. దీంతో ఎంపీ వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

New Update
AP: ప్రోటోకాల్ రగడ.. ఎంపీ వర్గీయులు ఆగ్రహం..!

Prakasam: ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం నియోజకవర్గంలో ప్రోటోకాల్ వివాదం నెలకొంది. టీడీపీలో మరోసారి అంతర్గత విభేదాలు బయటపడ్డాయి. నిన్న NTR పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో మంత్రులు గొట్టిపాటి రవి, నిమ్మల రామానాయుడు పాల్గొన్నారు. వారికి స్వాగతం పలుకుతూ భారీగా ఏర్పాట్లు చేశారు. అయితే, ఫ్లెక్సిలలో ఒంగోలు MP మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఫొటో కనిపించలేదు. దీంతో ఎంపీ వర్గీయులు అగ్రహం వ్యక్తం చేశారు.

గత ఎన్నికల నేపథ్యంలోనే ఈ విభేదాలు ఏర్పడినట్లు తెలుస్తోంది. టీడీపీ శాసనసభ స్థానం కోల్పోవడానికి మాగుంట, మరికొంత మంది సహకరించకపోవడమే కారణమని ఏరీక్షన్ బాబు వర్గం భావిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే టీడీపీ, జనసేన వేరు వేరుగా కార్యక్రమాలు చేసుకుంటున్నారు.

కొత్తగా మరోసారి MP మాగుంట ప్రోటోకాల్ వివాదం తెరమీదకు వచ్చింది. ప్రభుత్వ కార్యక్రమంలో MP ఫొటోతో ఫ్లెక్సీ లేకపోవడం నియోజకవర్గంలో హాట్ టాపిక్ గా మారింది. కావాలనే చేశారా? లేక యాదృచ్ఛికంగా? జరిగిందా అని నియోజకవర్గంలో చర్చ నడుస్తోంది.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు