Road Accident : మాదాపూర్ కేబుల్ బ్రిడ్జిపై దారుణం.. ఫొటోలు దిగుతున్న ఇద్దరిని ఢీకొట్టి..
మాదాపూర్లోని కేబుల్ బ్రిడ్జిపై మరో హిట్ అండ్ రన్ కేసు చోటుచేసుకుంది. బ్రిడ్జిపై ఫొటోలు దిగుతున్న ఇద్దరు వ్యక్తులను గుర్తు తెలియని కారు ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఆ ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. ప్రమాదానికి కారణమైన వారి కోసం పోలీసులు వెతుకుతున్నారు.