ఖమ్మం బయలుదేరిన రేవంత్ రెడ్డి-VIDEO
ఖమ్మం జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించడానికి సీఎం రేవంత్ రెడ్డి రోడ్డు మార్గంలో బయలుదేరారు. జిల్లా మంత్రులతో కలిసి వరద బాధితలను రేవంత్ పరామర్శించనున్నారు. ఈ రోజు రాత్రి ఆయన ఖమ్మంలోనే ఉండనున్నారు.
ఖమ్మం జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించడానికి సీఎం రేవంత్ రెడ్డి రోడ్డు మార్గంలో బయలుదేరారు. జిల్లా మంత్రులతో కలిసి వరద బాధితలను రేవంత్ పరామర్శించనున్నారు. ఈ రోజు రాత్రి ఆయన ఖమ్మంలోనే ఉండనున్నారు.
తూళ్లూరు మండలంలోని కృష్ణానది సమీపంలో లంక గ్రామాలు పూర్తిగా వరద నీటిలో మునిగిపోయాయి. ఈ క్రమంలో పెదలంకలో సుమారు 300 పాడి గేదెలు వరద నీటిలో కొట్టుకుపోయాయి. ఇప్పటికే 300 మంది గ్రామస్థులను అధికారులు సమీపంలోని ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పునరావాస కేంద్రానికి తరలించారు
మహబూబాబాద్ జిల్లాలో ఆకేరు వాగును దాటే క్రమంలో కారు గల్లంతు కావడంతో.. యువ వ్యవసాయ శాస్త్రవేత్త అశ్విని సహా ఆమె తండ్రి గల్లంతయ్యారు. వారి మృతదేహాలను సహాయక బృందాలు వెలికితీశాయి.
హైదరాబాద్ నుంచి విజయవాడ, ఖమ్మం రాకపోకలు పూర్తిగా స్థంభించిపోయాయి. సూర్యపేట-ఖమ్మం మార్గంలో పాలేరు నది పొంగిపొర్లుతోంది. దీంతో అత్యవసర ప్రయాణాలు ఉన్నవారికోసం కొన్ని ప్రత్యేక రూట్లు సూచించారు పోలీసులు.
ఏపీ నంద్యాల జిల్లా కాశీపురంలో కామాంధుడు రెచ్చిపోయాడు. ఇంట్లో ఒంటరిగా ఉన్న 13 ఏళ్ల బాలికపై అత్యాచారయత్నం చేశాడు. పాప కేకలు వేయడంతో స్థానికులు పట్టుకుని దేహశుద్ధి చేశారు. నిందితుడు దాసయ్య స్కూల్ బస్ డ్రైవర్గా గుర్తించారు.
రికార్డు స్థాయి వర్షాపాతంతో విజయవాడలో వరద నీరు పోటెత్తింది. అనేక ప్రాంతాలు జలమయం అవ్వడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సింగనగర్ తో పాటు అనేక కాలనీల్లో భారీగా వరదనీరు వచ్చి చేరింది. ఇందుకు సంబంధించిన ఎక్స్క్లూజివ్ డ్రోన్ విజువల్స్ ఈ వీడియోలో చూడండి.
వర్షం, వరదలతో ఇబ్బంది పడుతున్నారా? ప్రభుత్వం మీ సమస్యలను పట్టించుకోవడం లేదా? అయితే.. 8712638855 నంబర్ కు మీ సమస్యను వివరిస్తూ ఫొటోలు, వీడియోలు మాకు పంపించండి. మీ తరఫున అధికారులకు ఆ సమస్యను మేం వివరించి పరిష్కారానికి కృషిచేస్తాం.
భారీ వర్షాల నేపథ్యంలో జెఎన్టీయూ కీలక నిర్ణయం తీసుకుంది. రేపు జరగాల్సిన బీటెక్, బీఫార్మసీ మూడో సంవత్సరం పరీక్షలను, ఎంబీఏ ఫస్ట్ ఇయర్ పరీక్షలను ఈ నెల 5వ తేదీకి వాయిదా వేసింది. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం రేపు విద్యాసంస్థలకు సెలవు ప్రకటించిన విషయం తెలిసిందే.