చంద్రబాబు నివాసంలో రాఖీ సంబరాలు-VIDEO
ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో రాఖీ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. సీఎంకు బ్రహ్మకుమారీలు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. టీడీపీ మహిళా నేతలు చంద్రబాబుకు రాఖీ కట్టేందుకు భారీగా తరలివచ్చారు.
ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో రాఖీ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. సీఎంకు బ్రహ్మకుమారీలు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. టీడీపీ మహిళా నేతలు చంద్రబాబుకు రాఖీ కట్టేందుకు భారీగా తరలివచ్చారు.
సీఎం రేవంత్ రెడ్డిని జూబ్లీహిల్స్ లోని ఆయన నివాసంలో కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థి అభిషేక్ మను సింఘ్వీ ఈ రోజు మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి సింఘ్వీకి శాలువా కప్పి ఘనంగా సత్కరించారు. అనంతరం దేశ, రాష్ట్ర రాజకీయ పరిణామాలపై వీరు చర్చించారు.
కాంగ్రెస్ సీనియర్ నేత అభిషేక్ మను సింఘ్వి ఈ రోజు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను మర్యాద పూర్వకంగా కలిశారు. తెలంగాణ నుంచి రాజ్యసభ అభ్యర్థిగా ఆయన రేపు నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ నేపథ్యంలో ప్రజా భవన్ లో భట్టి విక్రమార్కను కలిసి తన నామినేషన్ కు రావాలని ఆహ్వానించారు.
సింహాద్రి అప్పన్న స్వామిని ఏపీ హోంమంత్రి అనిత ఈ రోజు కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. సింహాచలం తొలి పావంచ నుంచి మెట్ల మార్గంలో కొండపైకి వెళ్లారు. అధికారులు ఆలయ మర్యాదలతో హోం మంత్రికి స్వాగతం పలికారు. అర్చకులు తీర్ధప్రసాదాలు అందించి ఆశీర్వదించారు.
తండ్రి వెంకన్నపై ప్రత్యర్థులు దాడి చేస్తుండగా చూసి తట్టుకోలెక గుండె పోటుకు గురై చనిపోయిన చిన్నారి పావని కుటుంబ సభ్యులను మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి పరామర్శించారు. సూర్యాపేట జిల్లా నాగారం మండలం డి.కొత్తపల్లిలోని వారి నివాసానికి వెళ్లి ధైర్యం చెప్పారు. అండగా ఉంటామని భరోసానిచ్చారు.
హను రాఘవపూడి - ప్రభాస్ మూవీకి సంబంధించి మేకర్స్ పోస్టర్ రిలీజ్ చేశారు. 1940 దశకంలో జరిగే కథ అని పోస్టర్లో తెలిపారు. మాతృభూమి ప్రజల కోసం ఒక యోధుడు చేసే పోరాటంగా మూవీ ఉండనుంది. ‘పరిత్రాణాయ సాధూనాం’ అంటూ భగవద్గీతలోని ఒక శ్లోకాన్ని పోస్టర్లో చూపించారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి ఈ రోజు తన పుట్టిన రోజు సందర్భంగా మాజీ సీఎం కేసీఆర్ ను ఎర్రవల్లిలోని ఆయన ఫామ్ హౌజ్ లో మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. సుభాష్ రెడ్డికి కేసీఆర్ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం రాష్ట్ర రాజకీయాలపై వీరు చర్చించారు.
సీఎం రేవంత్ రెడ్డిని జూబ్లీహిల్స్ లో ఆయన నివాసంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ రోజు మర్యాద పూర్వకంగా కలిశారు. పెట్టబడుల కోసం చేపట్టిన విదేశీ పర్యటన విజయవంతంగా ముగిసిన నేపథ్యంలో సీఎంకు పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం రాష్ట్ర రాజకీయాలపై చర్చించారు.
మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఈ రోజు ఉదయం కేరళలోని పంబ నుంచి శబరిమలైలోని అయ్యప్ప స్వామి ఆలయానికి కాలినడకన వెళ్లారు. వీరి వెంట తంబళ్లపల్లి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి, ఇతర భక్తులు ఉన్నారు.