Kota: కోటాలో విద్యార్థి అదృశ్యం.. ఇంటికి రానని తండ్రికి మెసేజ్
రాజస్థాన్లోని కోటాలో నీట్ శిక్షణ కోసం వచ్చిన మరో విద్యార్థి అదృశ్యమయ్యాడు. ఉన్నత చదువులు చదవాలని లేదు, దూరంగా వెళ్లిపోతున్నాను, ఐదేళ్లవరకు తిరిగిరాను అంటూ తన తల్లిదండ్రులకు అతడు మెసేజ్ పెట్టాడు. దీంతో వారు పోలీసులను ఆశ్రయించారు.