Crime News: దారుణం.. అందరిముందే నిప్పంటించుకున్నాడు
చెన్నైలోని తురువల్లూర్ జిల్లా గుమ్ముడిపుందిలో దారుణం చోటుచేసుకుంది. ఓ వ్యక్తి తన ఇంటిని కూల్చివేయొద్దంటూ అధికారులు, పోలీసుల ముందే కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. ఆ తర్వాత ఇంటి నుంచి బయటకు పరిగెత్తాడు. దీంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు మంటలు ఆర్పేశారు.