రూ.10 నాణేలు చెల్లుతాయి.. లావాదేవీలకు వాడొచ్చు
రూ.10 నాణేలు చెల్లవనే అపోహ గత కొన్నేళ్లుగా ప్రజల్లో ఉంది. ఇవి చెల్లుతాయని ఇప్పటికే ఆర్బీఐ ప్రకటించింది. ఈ నాణేలు చలామణిలో లేదన్న అపోహను తొలగించేందుకు బ్యాంకు అధికారులు కూడ విశేష కృషి చేస్తున్నారు.
రూ.10 నాణేలు చెల్లవనే అపోహ గత కొన్నేళ్లుగా ప్రజల్లో ఉంది. ఇవి చెల్లుతాయని ఇప్పటికే ఆర్బీఐ ప్రకటించింది. ఈ నాణేలు చలామణిలో లేదన్న అపోహను తొలగించేందుకు బ్యాంకు అధికారులు కూడ విశేష కృషి చేస్తున్నారు.
ఎన్సీపీ నేత బాబా సిద్దిఖీ హత్య కేసుతో కాల్పులు జరిపిన వారి ఆచుకీ కోసం పోలీసులు వెతుకుతూనే ఉన్నారు. అయితే తాజాగా లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌కు చెందిన ఏడుగురు షూటర్లను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. హత్యకు సంబంధించి వీరిపై విచారణ చేయనున్నారు.
తూర్పు లడఖ్ సెక్టార్‌లోని డెమ్చోక్, డెస్పాంగ్ నుంచి భారత్, చైనా బలగాలు వెనక్కి వెళ్తున్నాయని భారత రక్షణశాఖ అధికారులు శుక్రవారం తెలిపారు. బ్రిక్స్ సదస్సులో జరిగిన ఒప్పందంలో భాగంగానే ఈ ప్రక్రియ మొదలైనట్లు పేర్కొన్నారు.
శీతాకాలానికి ముందు దేశ రాజధాని ఢిల్లీ సహా ఎన్సీఆర్ ప్రాంతాల్లో ప్రతీ ఏడాది వాయు కాలుష్యం తీవ్రంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో బహిరంగ ప్రదేశాల్లో ఉదయం పూడ నడవడం అలాగే క్రీడలు వంటి వాటికి దూరంగా ఉండాలని కేంద్ర ఆరోగ్యశాఖ సూచించింది.
ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ కొత్త సేవలకు శ్రీకారం చుట్టింది. పరిశుభ్రత, ఆహార నాణ్యత ప్రమాణాలు ధ్రువీకరించేదుకు 'సీల్ బ్యాడ్జ్'ను తీసుకొచ్చింది. ఆహార నాణ్యత విషయంలో రెస్టరెంట్లకు కస్టమర్లు ఇచ్చే ఫీడ్‌బ్యాక్ ఆధారంగా ఈ బ్యాడ్జ్‌ను జారీ చేస్తారు.
బంగాళాఖాతంలో వాయుగుండం కొనసాగుతోంది. వాయువ్య దిశగా కదులుతూ ఈనెల 24వ తేదీకి తీవ్ర తుపాన్‌గా మారే అవకాశం ఉంది. ఈనెల 24వ తేదీ రాత్రి లేదా 25వ తేదీ ఉదయం పూరీ , సాగర్ ద్వీపం మధ్య తీరం దాటే అవకాశం ఉన్నట్లు సమాచారం.
ఏ స్త్రీ అయినా ఏ వయసులో అందంగా ఉంటుందని ఎవరినైనా అడిగితే.. యవ్వనంలో అందంగా ఉంటారని చెబుతారు. 40 ఏళ్ల నుంచి 45 ఏళ్ల మధ్యలో ఉన్న మహిళలే అందంగా.. ఆకర్షణీయంగా కనిపిస్తారని పలు అధ్యయనాలు చెబుతున్నాయి.
కోల్‌కతా జూ.డాక్టర్ హత్యాచార కేసులో ఇంతవరకూ న్యాయం జరగలేదు. దీంతో బాధితురాలి తండ్రి కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. తమ కుంటంబం తీవ్ర మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటుందంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
బాబా సిద్ధిఖీ హత్యతో గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ పేరు దేశవ్యాప్తంగా మారుమోగింది. ప్రస్తుతం అతడు జైల్లో ఉంటున్నాడు. అయితే అతడిని ఏ పోలీసు అధికారైన ఎన్కౌంటర్ చేస్తే రూ. కోటీ 11 లక్షల నగదు బహుమానం ఇస్తామని క్షత్రియ కర్ణి సేన ప్రకటన చేసింది.