BJP-JDS: సాధారణ ఎన్నికల్లో కలిసి పోటీ చేయనున్న బీజేపీ-జేడీఎస్
విపక్షాలు ఇండియా కూటమిగా ఏర్పడిన నేపథ్యంలో బీజేపీ కూడా పాత మిత్రులను దగ్గర చేసుకునేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలోనే కర్ణాటకకు చెందిన జీడీఎస్ పార్టీతో పొత్తుకు ముందుకొచ్చింది. వచ్చే లోక్సభ ఎన్నికల్లో బీజేపీ-జేడీఎస్ కలిసి పోటీచేయాలని ఓ అంగీకారానికి వచ్చినట్లు మాజీ సీఎం యడియూరప్ప ప్రకటించారు.