MLC Kavitha: ఎమ్మెల్సీ కవిత ఫోన్ హ్యాక్!
ఎమ్మెల్సీ కవిత ఫోన్ హ్యాక్ అయింది. తన సోషల్ మీడియా ఖాతాలు ఎవరో హ్యాక్ చేశారంటూ ఎమ్మెల్సీ కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ డీజీపీకి ఫిర్యాదు చేశారు కవిత.
ఎమ్మెల్సీ కవిత ఫోన్ హ్యాక్ అయింది. తన సోషల్ మీడియా ఖాతాలు ఎవరో హ్యాక్ చేశారంటూ ఎమ్మెల్సీ కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ డీజీపీకి ఫిర్యాదు చేశారు కవిత.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఈడీ తాజాగా నాలుగోసారి సమన్లు పంపి విచారణకు రావాలని ఆదేశించింది. ఇందుకు స్పందించిన కవిత తాను విచారణకు రాలేనంటూ ఈడీకి లేఖ రాసింది. సుప్రీంకోర్టు నుంచి తనకు రక్షణ కల్పించే ఉత్తర్వులు ఉన్నాయని.. తన కేసు పెండింగ్లో ఉండటం వల్ల రాలేకపోతున్నానంటూ తెలిపింది.
తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ పెన్షన్ల ఊసే ఎత్తడం లేదని చురకలు అంటించారు ఎమ్మెల్సీ కవిత. జనవరి ఒకటో తేది నుంచి రూ.4వేలు ఇస్తా అని చెప్పిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఏమైందని ప్రశ్నించారు. ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలన్నారు.
మేడిగడ్డ ప్రాజెక్ట్ కుంగిపోవడంపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేపడుతామని సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కౌంటర్ ఇచ్చారు ఎమ్మెల్సీ కవిత. అలాగే, తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో జరిగిన గవర్నర్ ప్రసంగంపై ఆమె అభ్యంతరం తెలిపారు.
రాజ్యసభలో రుతుక్రమ పోరాటాలను కేంద్ర మహిళా మరియు శిశు అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ జీ కొట్టిపారేయడం పట్ల ఎమ్మెల్సీ కవిత ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఋతుస్రావం ఎంపిక కాదు.. ఇది జీవ వాస్తవికత అని ఆమె అన్నారు. కేంద్రమంత్రి మాటను ఆమె ఖండించారు.
రేపు ఎన్నికల ఫలితాలు విడుదల కానున్న వేళ ఎమ్మెల్సీ కవిత చేసిన ఓ ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారింది. మై హీరో అంటూ కేసీఆర్ నడిచి వస్తున్న ఓ వీడియోను కవిత తన ట్విట్టర్ (X) లో పోస్టు చేశారు. దీంతో నెటిజన్లు అనేక విధాలుగా ఈ ట్వీట్ పై కామెంట్లు చేస్తున్నారు.
రాష్ట్రంలో మరోసారి బీఆర్ఎస్ గెలుపు ఖాయమని, హ్యట్రిక్ ముఖ్యమంత్రిగా కేసీఆర్ చరిత్ర సృష్టించబోతున్నారని ఎమ్మెల్సీ కవిత అన్నారు. పోలింగ్ అనంతరం పెద్దమ్మ తల్లి ఆలయాన్ని దర్శించుకున్న ఆమె మీడియాతో మాట్లాడారు. ప్రజలను తప్పదోవ పట్టించడానికి ఫేక్ సర్వేలు వస్తుంటాయని విమర్శించారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మరోసారి కాంగ్రెస్ పై సంచలన కామెంట్స్ చేశారు. నిజామాబాద్లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కాంగ్రెస్ మొసలి కన్నీరును నమ్మితే ప్రజలకు కన్నీళ్లే మిగులుతాయన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగ కాంగ్రెస్ నేతల సమావేశాలు మాత్రమే జరిగాయని ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్ నేత చిదంబరం తెలంగాణ అమరవీరులకు క్షమాపణలు చెప్పడంపై ఎమ్మెల్సీ కవిత స్పందించారు. గ్యారంటీలకు గాంధీలు.. క్షమాపణలకు బంట్రోతులా? అని ప్రశ్నించారు. తెలంగాణను మోసం చేసిన గాంధీలు కనీసం స్వయంగా క్షమాపణలు చెప్పలేరా? అని ప్రశ్నించారు.