goshamal: డబుల్ బెడ్రూం ఇళ్ల కేటాయింపుపై ఎమ్మెల్యే రాజాసింగ్ ఆగ్రహం.. కేసీఆర్ ప్రభుత్వంపై విమర్శలు
బీఆర్ఎస్ ప్రభుత్వం పేదల సొంతింటి కల నెరవేర్చేందుకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పథకాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టిన విషయం తేలిసిందే. అయితే పేదలకు ఇళ్లను కేటాయించే ప్రక్రియను నేడు ప్రారంభించింది కేసీఆర్ సర్కార్. హైదారబాద్ జీహెచ్ఎంసీ పరిధిలోని 24 నియోజకవర్గాల్లో 11,700 మంది లబ్దిదారులకు ఆన్లైన్ డ్రా ద్వారా లబ్దిదారులకు ఇళ్లను ఎంపిక చేశారు. దీన్ని తప్పు పట్టారు ఎమ్మెల్యే రాజాసింగ్.