లైంగికదాడి ఆరోపణలపై స్పందించిన నాగార్జున.. టెస్టులకు సిద్ధం అంటూ!
లైంగికదాడి ఆరోపణలపై వైసీపీ మాజీ మంత్రి మెరుగు నాగార్జున స్పందించారు. తనపై తాడేపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన మహిళ ఎవరో తనకు తెలియదన్నారు. ఆమెతో తనకు ఎలాంటి సంబంధం లేదని, దీనిపైన పూర్తిస్థాయిలో విచారణ జరగాల్సివుందన్నారు.