మానసికంగా స్ట్రాంగ్‌గా ఉండాలంటే?
మానసికంగా స్ట్రాంగ్‌గా ఉండాలంటే.. వ్యాయామం చేయడం, ఇతరులతో మాట్లాడటం, సూర్యరశ్మిలో ఉండటం, కొత్త విషయాలు నేర్చుకోవడం వంటివి చేయాలని నిపుణులు చెబుతున్నారు. వెబ్ స్టోరీస్
మానసికంగా స్ట్రాంగ్‌గా ఉండాలంటే.. వ్యాయామం చేయడం, ఇతరులతో మాట్లాడటం, సూర్యరశ్మిలో ఉండటం, కొత్త విషయాలు నేర్చుకోవడం వంటివి చేయాలని నిపుణులు చెబుతున్నారు. వెబ్ స్టోరీస్
మనలో చాలా మంది చిన్న విషయానికి టెన్షన్ పడుతుంటారు. ఏదో కోల్పోయినట్లు ఫీల్ అవుతుంటారు. ఇది మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. మెంటల్ ఫ్రీగా ఉండాలంటే ఈ టిప్స్ ఫాలో అవ్వండి. అవేంటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీలోకి వెళ్లండి.
శరీరానికి మాత్రమే కాదు మానసికంగా కూడా విశ్రాంతి చాలా అవసరం. మానసిక విశ్రాంతి అవసరమని చెప్పే సంకేతాలు ఇవే. నిద్ర లేమి, ఒంటరితనం, మూడ్ స్వింగ్స్, బాధ, చిరాకు, తలనొప్పి, ఒత్తిడి లాంటి లక్షణాలు కనిపిస్తే మానసిక విశ్రాంతి తప్పనిసరి అని సూచన.
ఆఫీస్‌కు వెళ్లాలంటే కొందరు ఎంప్లాయిస్‌లో అదోరకమైన భయం, ఆందోళన ఉంటుంది. అనేక పెండింగ్ ప్రాజెక్టులు, సీనియర్ల నుంచి పెరుగుతున్న ఒత్తిడి.. వెరసి ఉద్యోగులు ఆందోలనకు గురవుతారు. ఈ సమస్య నుంచి బయటపడాలంటే.. స్నేహితులతో గడపడం, సమయానికి తినడం, వ్యాయామం చేస్తూ ఉండాలి.
కొంత మందికి తరచుగా కోపం, చిరాకు వస్తుంటాయి. ఆహారపు అలవాట్లు కూడా మానసిక స్థితి పై ఎక్కువ ప్రభావం చూపుతాయి. ఇలాంటి సమస్య ఉన్న వారు మానసిక స్థితిని ప్రభావితం చేసే కెఫిన్, షుగర్ ఫుడ్స్, ఆల్కహాల్ వంటి ఆహారాలకు దూరంగా ఉండాలి.
ఒత్తిడి, ఆందోళనను దూరం చేయడానికి లైఫ్ స్టైల్ మార్చుకోవాల్సి ఉంటుంది. సరైన నిద్ర లేకపోవడం కూడా ఒత్తిడికి ప్రధాన కారణం. ఒత్తిడి, ఆందోళనగా ఉన్నప్పుడు ఏదైనా మనసుకు ప్రశాంతతను కలిగించే పనులను ఎక్కువగా చేయడానికి ప్రయత్నించండి.
చాలా మంది ఒత్తిడి, ఆందోళనతో బాధపడుతుంటారు. మానసిక సమస్యలు ఆరోగ్యం పై తీవ్రమైన ప్రభావం చూపును. ఒత్తిడి,ఆందోళనగా అనిపించినప్పుడు.. వంట చేయడం, ఇంట్లో మొక్కలకు నీళ్ళు పోయడం, ఇంటి పనులు , పెట్స్ తో ఆడుకోవడం చేస్తే వాటి నుంచి డైవర్ట్ అవ్వడానికి సహాయపడతాయి.