Lokesh Yuvagalam: యువగళం పాదయాత్రపై నారా లోకేష్ కీలక నిర్ణయం..! అరెస్ట్ భయంతోనేనా..?

యువగళం పాదయాత్రకు మరోసారి బ్రేక్‌ పడింది. స్కిల్ డెవలప్ మెంట్ కేసు నేపధ్యంలో యువగళం పాదయాత్ర తేదీని మార్చినట్లుగా టీడీపీ నేతలు చెబుతున్నారు. అక్టోబర్ 3న సుప్రీంకోర్టులో స్కిల్ డెవలప్ మెంట్ కేసు విచారణ ఉన్నందున యువగళం పాదయాత్రను వాయిదా వేసారు.

New Update
Lokesh Yuvagalam: యువగళం పాదయాత్రపై నారా లోకేష్ కీలక నిర్ణయం..! అరెస్ట్ భయంతోనేనా..?

LOKESH YUVAGALAM : టీడీపీ అధినేత చంద్రబాబు( TDP Chandrababu Arrest) అరెస్ట్ తో నారా లోకేశ్(lokesh) యువగళం పాదయాత్రకు బ్రేక్‌ పడింది. ఈ నెల 29 నుంచి మళ్లీ మొదలుపెట్టాలని ఇటీవల జరిగిన టీడీపీ పొలిటికల్ యాక్షన్ కమిటీ సమావేశంలో నిర్ణయించారు. అయితే, లోకేశ్ తన పాదయాత్రను వాయిదా వేసుకోవాలని టీడీపీ నేతలు కోరారు. అక్టోబరు 3న సుప్రీంకోర్టులో స్కిల్ కేసు వాదనలు ఉండడంతో, పాదయాత్రను మరో తేదీకి వాయిదా వేయాలని టీడీపీ నేతలు లోకేశ్ కు సూచించారు.

publive-image

చంద్రబాబు కేసు విచారణ సందర్భంగా ఢిల్లీలో న్యాయవాదులతో సంప్రదింపులు జరపాల్సి ఉంటుందని, పాదయాత్రలో ఉంటే సంప్రదింపులు కష్టమవుతాయని, లోకేశ్ ఢిల్లీ(Delhi)లో ఉంటేనే మంచిదని వారు తమ అభిప్రాయాలను తెలియజేశారు. టీడీపీ నేతల అభిప్రాయాలతో నారా లోకేశ్ ఏకీభవించారు. యువగళం పాదయాత్ర తేదీని మరోసారి వాయిదా వేసుకోవాలని నిర్ణయించుకున్నారు. త్వరలో నేతలతో చర్చించి పాదయాత్రకు మరో తేదీని ప్రకటించనున్నారు.

మరోవైపు లోకేష్‌ను కూడా  అరెస్టు  చేసేందుకు అధికారులు సిద్దంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఇన్ కేస్ లోకేష్ అరెస్ట్ అయితే అతనికి బదులు అదే ముహూర్తానికి  ఆయన సతీమణి నారా బ్రాహ్మణి(Nara Brahmani) పాదయాత్ర మొదలుపెట్టేందుకు సిద్ధమయ్యారని సమాచారం. ఆమెకు ఇప్పటికే అన్ని విషయాలను కుటుంబసభ్యులు వివరించినట్లు తెలుస్తోంది. నారా, నందమూరి కుటుంబాలకు చెందిన బ్రాహ్మణి పాదయాత్ర చేస్తే ప్రజల్లో సానుభూతి ఎక్కువగా వస్తుందని టీడీపీ నేతలు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే చంద్రబాబు అరెస్టుతో ప్రజల్లో టీడీపీ పట్ల సానుభూతి కనిపిస్తోంది. ఇప్పటికి చంద్రబాబు అరెస్ట్ తో ఏపీ వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు, కార్యకర్తలు ఆందోళన చేస్తునే ఉన్నారు.

Also Read: గణేశ్ నిమజ్జనం వద్దని వెక్కి వెక్కి ఏడ్చిన బాలుడు.. విగ్రహాన్ని హత్తుకుని ఏం చేశాడంటే?

#lokesh #lokesh-yuvagalam #tdp #ap-politics
Advertisment
Advertisment
తాజా కథనాలు