Sleep Deprivation: ఈ విషయాలు తెలుసుకుంటే నిద్ర విషయంలో ఆ తప్పు చేయరు.. కచ్చితంగా ఇవి పాటించాల్సిందే..!
ఆరోగ్యానికి, శరీరానికి నిద్ర చాలా ముఖ్యం. మన మెదడు చురుకుగా పనిచేయాలంటే సరైన నిద్ర తప్పనిసరి. నిద్ర మానసిక.. శారీరక స్థితిని మెరుగుపరచడానికి సహాయపడుతుంది. కానీ కొంత మంది ఏదైనా పనిలో ఉండటం, లేదా ఒత్తిడి ఇలా పలు కారణాల వల్ల నిద్రలేమి సమస్యతో బాధపడుతుంటారు. మరికొంత మంది రాత్రిళ్ళు ఫోన్ చూస్తూ నిద్రను నిర్లక్ష్యం చేస్తుంటారు. కానీ ఇక్కడ అందరు తెలుసుకోవాల్సిన విషయం.. రోజుకు కనీసం 5 గంటల కంటే తక్కువ నిద్రపోతే టైపు-2 మధుమేహం, గుండె సమస్యలు, డిప్రెషన్, మతిమరుపు వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అసలు నిద్రలేమి వల్ల వచ్చే సమస్యలేంటో చూడండి..