Dengue: డెంగీ రోగులకు గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందా?
దోమ కాటు వల్ల డెంగీ వ్యాధి వస్తుంది. డెంగీ కారణంగా వ్యక్తికి అధిక జ్వరం వచ్చి ప్లేట్లెట్స్ తగ్గుతాయి. సకాలంలో చికిత్స చేయకపోతే.. రోగి చనిపోవచ్చు కూడా. డెంగీ జ్వరం గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని కూడా పెంచుతుందని తాజాగా చేసిన పరిశోధనలో వెల్లడైంది.