సల్మాన్ తల తెస్తే 25 లక్షలు | Salman Khan | Lawrence Bishnoi | ₹25 lakh supari , AK-47, M16 weapons
గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ క్రైమ్ ప్రపంచానికి రారాజుగా మారుతున్నాడు. విద్యార్థి దశలోనే రాజకీయాలు మొదలుపెట్టిన లారెన్స్ నేర ప్రస్థానం జైలు నుంచే ముఠాలను నడిపే స్థాయికి ఎదిగింది. పంజాబ్ కు చెందిన బిష్ణోయ్ ముంబైలో తన మూలాలను బలపరుచుకుంటున్నాడు.
మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్ధిఖీ దారుణ హత్య దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. సల్మాన్ ఖాన్‌తో సిద్ధిఖీ క్లోజ్‌గా ఉండడమే ఈ హత్యకు దారితీసినట్లు తెలుస్తోంది. ఇక బిష్ణోయ్ గ్యాంగ్ నెక్స్ట్ టార్గెట్ సల్మాన్ ఖానేనని చర్చ నడుస్తోంది.